Nara Bhuvaneswari: అమ్మకు లోకేశ్‌, అత్తకు బ్రాహ్మణి... భువనేశ్వరికి శుభాకాంక్షల వెల్లువ

Nara Lokesh and Brahmani greets wife Bhuvaneshwari on birthday
  • నేడు నారా భువనేశ్వ‌రి పుట్టిన‌రోజు
  • తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
  • అత్తగారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు చెప్పిన నారా బ్రాహ్మణి
నేడు నారా భువనేశ్వరి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కుటుంబ స‌భ్యులు ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నారు. భ‌ర్త సీఎం చంద్ర‌బాబు ఆమె తన జీవితానికి వెలుగు అని అభివర్ణించారు. అలాగే కుమారుడు లోకేశ్ కూడా ఆమెకు 'ఎక్స్' వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. నువ్వే నా బలం, నా మార్గదర్శి అంటూ త‌ల్లికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ లోకేశ్ ట్వీట్ చేశారు. 

"పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా! నువ్వే నా బలం, నా మార్గదర్శి, మా కుటుంబానికి గుండెకాయ. నీ నిస్వార్థమైన ప్రేమ, మౌనంగా నువ్వు చూపించే ధైర్యం నన్ను ఎంతగానో తీర్చిదిద్దాయి. నాకు నేర్పిన విలువలకు, ప్రతీరోజూ మా జీవితాల్లోకి నువ్వు తీసుకొచ్చే ఆత్మీయతకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ ఏడాది నీకు సంతోషం, ఆరోగ్యం, ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నాను" అని లోకేశ్ త‌న పోస్టులో రాసుకొచ్చారు. 

భువనేశ్వరి కోడలు నారా బ్రాహ్మణి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు భూ అత్తా! నేను నీ కోడలు కాకముందు నుంచే నువ్వు నాకు ఆదర్శం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ దృఢత్వం, హుందాతనం, నిస్వార్థమైన ప్రేమ నన్ను ఎంతగానో తీర్చిదిద్దాయి. నా అత్తగా, మార్గదర్శిగా, నా ధైర్యానికి గొప్ప మూలంగా ఉన్నందుకు ధన్యవాదాలు" అని పోస్ట్ చేశారు.
Nara Bhuvaneswari
Nara Lokesh
Brahmani Nara
Chandrababu Naidu
Telugu Desam Party
TDP
Happy Birthday
Birthday Wishes
Family
Andhra Pradesh

More Telugu News