Nara Lokesh: విశాఖలో గవర్నర్‌తో మంత్రి లోకేశ్ భేటీ... 'యోగాంధ్ర'కు సర్వం సిద్ధం

Nara Lokesh Meets Governor in Visakhapatnam for Yoga Andhra Preparations
  • ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్
  • గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేశ్
  • పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించి 'యువగళం' పుస్తకం అందజేత
  • రేపు విశాఖలో 5 లక్షల మందితో 'యోగాంధ్ర' కార్యక్రమం
  • ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ భారీ ఏర్పాట్లు
  • 'యోగాంధ్ర'కు హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి, మంగళగిరి శాలువాతో సత్కరించారు. అనంతరం, తన యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి లోకేశ్ గవర్నర్ నజీర్‌కు అందజేశారు.

శనివారం (జూన్ 21) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో 'యోగాంధ్ర' పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ రికార్డు లక్ష్యంగా సుమారు 5 లక్షల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో, 'యోగాంధ్ర'పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ప్రధాని వస్తుండడంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. ఈ బృహత్తర కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విశాఖ నగరం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
Nara Lokesh
Andhra Pradesh
Visakhapatnam
Governor Abdul Nazeer
Yoga Day
Yoga Andhra
World Yoga Day
Narendra Modi
Yuva Galam Padayatra
AP Politics

More Telugu News