Shakeel: ఆరుగురు బిడ్డల తండ్రి... చిన్న కొడుక్కి కాబోయే భార్యతో జంప్!

Shakeel elopes with sons bride to be in Rampur
  • కొడుకు కోసం చూసిన అమ్మాయితోనే ప్రేమలో పడ్డ తండ్రి
  • కుమారుడికి కాబోయే భార్యను పెళ్లి చేసుకున్న షకీల్
  • అడ్డుకున్న కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు ఆరోపణ
  • రూ. 2 లక్షల నగదు, బంగారంతో ఇంటి నుంచి పరారై పెళ్లి
  • ఇదే తరహా ఘటన ఏప్రిల్‌లోనూ యూపీలో నమోదు
సమాజంలో అరుదుగా జరిగే ఓ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో వెలుగుచూసింది. కన్న కొడుకు కోసం చూసిన అమ్మాయితోనే ఓ వ్యక్తి ప్రేమలో పడి, చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

రాంపూర్‌కు చెందిన షకీల్ అనే వ్యక్తి, తన మైనర్ కొడుకు కోసం ఓ యువతితో పెళ్లి నిశ్చయించాడు. ఆ తర్వాత, తరచూ ఆ యువతి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే షకీల్, తన కొడుక్కి కాబోయే భార్యతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులపై షకీల్ దాడి చేశాడని అతడి భార్య షబానా ఆరోపించింది. అనంతరం షకీల్ ఆ యువతితో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించాడని తెలిపింది.

షకీల్‌తో తనకు ఆరుగురు పిల్లలు ఉన్నారని షబానా వెల్లడించింది. తన భర్తకు, కొడుక్కి కాబోయే భార్యతో అక్రమ సంబంధం ఉందని తనకు అనుమానం కలిగిందని ఆమె అన్నారు. రెండుసార్లు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని కూడా ఆమె పేర్కొంది. "రోజంతా ఆమెకు వీడియో కాల్స్ చేసేవాడు. మొదట్లో ఎవరూ నన్ను నమ్మలేదు. తర్వాత నేను, నా కొడుకు కలిసి వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాం" అని షబానా మీడియాకు తెలిపింది. తన తండ్రి వ్యవహారం తెలిసిన తర్వాత, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన 15 ఏళ్ల కొడుకు నిరాకరించాడని ఆమె వివరించింది.

ఈ వ్యవహారం గురించి తమ తాతయ్య, నాయనమ్మలకు కూడా తెలుసని, తండ్రి పెళ్లికి వారే సహాయం చేశారని షకీల్ కొడుకు ఆరోపించాడు. షకీల్ ఇంట్లోంచి రూ. 2 లక్షల నగదు, సుమారు 17 గ్రాముల బంగారం తీసుకుని వెళ్లిపోయి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు.

గతంలోనూ ఇలాంటి ఘటనే...!
కాగా, ఏప్రిల్‌ నెలలో ఉత్తరప్రదేశ్‌లోనే ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. కుమార్తెకు కాబోయే భర్తతో అత్త లేచిపోయింది. అలీఘర్‌కు చెందిన శివాని అనే యువతి పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో ఆమె తల్లి అనిత పారిపోయింది. తన తల్లి అనిత, ఇంట్లో ఉన్న రూ. 3.5 లక్షలకు పైగా నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయిందని శివాని చెప్పింది. "నాకు ఏప్రిల్ 16న రాహుల్‌తో పెళ్లి జరగాల్సి ఉండగా, మా అమ్మ ఏప్రిల్ 6న అతనితో వెళ్లిపోయింది. రాహుల్, మా అమ్మ గత మూడు నాలుగు నెలలుగా ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుకునేవారు" అని శివాని ఆవేదన వ్యక్తం చేసింది.

తాను బెంగళూరులో వ్యాపారం చేస్తానని, కాబోయే అల్లుడితో తన భార్య అనిత గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తనకు తెలిసిందని శివాని తండ్రి జితేంద్ర కుమార్ అన్నారు. 
Shakeel
Rampur
Uttar Pradesh
minor son
arranged marriage
love affair
elope
Shabana
inter caste marriage

More Telugu News