Ananya Nagalla: తన లవ్ బ్రేకప్ గురించి వెల్లడించిన అనన్య

Ananya Nagalla Reveals Her Love Breakup Experience
  • ప్రేమ విఫలమై కుంగుబాటుకు లోనయ్యానన్న అనన్య నాగళ్ల
  • రెండేళ్లపాటు మానసిక వేదన అనుభవించానని వెల్లడి
  • పనిపై మాత్రం ఆ ప్రభావం పడనివ్వలేదన్న నటి
  • స్నేహితులకు తప్ప ఇంట్లో కూడా ఈ విషయం చెప్పలేదన్న అనన్య
  • ప్రస్తుతం ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు వెల్లడి
  • 'పొట్టేల్' నటనకు 'గద్దర్' స్పెషల్ జ్యూరీ అవార్డు
విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న యువ నటి అనన్య నాగళ్ల, తన వ్యక్తిగత జీవితంలోని ఓ చీకటి అధ్యాయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కెరీర్‌లో విజయాలు అందుకుంటున్న సమయంలోనే ప్రేమలో విఫలమవడం తనను తీవ్రంగా కుంగదీసిందని, ఆ బాధ నుంచి బయటపడటానికి రెండేళ్లు పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే, అనన్య నాగళ్ల మాట్లాడుతూ, "సినిమా రంగంలో ఎదురయ్యే సవాళ్లు, విమర్శలు, ప్రశంసలు అన్నింటినీ స్వీకరించడం అలవాటు చేసుకున్నాను. వృత్తిపరంగా ఎలాంటి ఒడిదొడుకులనైనా తట్టుకోగలను. కానీ, వ్యక్తిగత జీవితంలో ప్రేమ విఫలమైనప్పుడు మాత్రం తట్టుకోలేకపోయాను. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొన్నాళ్లకే నా జీవితంలో బ్రేకప్ జరిగింది. ఆ బాధ నన్ను రెండేళ్లపాటు వెంటాడింది," అని తెలిపారు.

ఆ క్లిష్ట సమయంలో తాను పడిన మానసిక వేదనను వివరిస్తూ, "ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేదు. రాత్రంతా ఏడ్చేదాన్ని. ఉదయాన్నే మళ్లీ మామూలుగా జిమ్‌కు వెళ్లిపోయేదాన్ని. షూటింగ్ స్పాట్‌లో కారవాన్‌లోకి వెళ్లి ఏడ్చి, మళ్లీ ఏమీ జరగనట్లుగా కెమెరా ముందుకు వచ్చేదాన్ని. ఈ విషయం నా స్నేహితులకు తప్ప ఇంట్లో వాళ్లకు కూడా తెలియదు. అయితే, నా వ్యక్తిగత జీవితంలోని సమస్యల ప్రభావం నా పని మీద పడకుండా జాగ్రత్తపడ్డాను," అని అనన్య వివరించారు.

ప్రస్తుతం తాను ఓ బాలీవుడ్ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు అనన్య శుభవార్త పంచుకున్నారు. అది కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రమని ఆమె పేర్కొన్నారు. 2018లో 'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనన్య, తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో కీలక పాత్ర పోషించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. 
Ananya Nagalla
Ananya Nagalla breakup
Ananya Nagalla interview
Tollywood actress
love failure
mental health
Bollywood project
Vakeel Saab
Mallesham

More Telugu News