Dhanush: థియేటర్‌లో కుబేర మూవీ చూస్తూ ఎమోషనల్ అయిన ధనుష్!

Dhanush Emotional Watching Kubera Movie in Theatre
  • ధనుష్, నాగార్జున కలిసి నటించిన మూవీ కుబేర
  • తొలిసారిగా బిచ్చగాడి పాత్రలో నటించిన హీరో ధనుష్
  • కుమారుడితో కలిసి చెన్నైలోని ఓ థియేటర్ లో మూవీని వీక్షించిన ధనుష్
  • బిచ్చగాడిగా తన పాత్రను చూసుకుని భావోద్వేగానికి గురయిన ధనుష్
తమిళ స్టార్ హీరో ధనుష్ తాను నటించిన 'కుబేర' మూవీని థియేటర్లో చూసి భావోద్వేగానికి గురయ్యారు. అక్కినేని నాగార్జునతో కలిసి ధనుష్ నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

తొలిసారిగా ధనుష్ ఈ చిత్రంలో బిచ్చగాడి పాత్ర పోషించారు. తాజాగా ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్‌లో తన కుమారుడితో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. వెండితెరపై తన పాత్రను చూసుకుని ధనుష్ భావోద్వేగానికి గురయ్యారు. బిచ్చగాడి పాత్రలో తనను తాను చూసి ఎమోషన్ అయినట్లు కనిపిస్తున్నారు.

ధనుష్ ఇదివరకే అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించగా, ఇప్పుడు ఓ బిచ్చగాడి పాత్రలోనూ నటించి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రంపై మంచి రివ్యూలు వస్తుండటంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ చిత్రంలో ధనుష్, నాగార్జునలలో ఎవరు హీరో అనేది చెప్పలేని విధంగా ఉందని అభిమానులు అంటున్నారు. సినిమా కథే విశేషంగా ఆకట్టుకుంటోందని ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తోంది. 
Dhanush
Kubera Movie
Nagarjuna
Sekhar Kammula
Tamil Cinema
Telugu Cinema
Dhanush as Beggar
Chennai Theatre
Movie Review

More Telugu News