Nithin: 'తమ్ముడు' చిత్రీకరణపై నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nithins Interesting Comments on Thammudu Movie Shooting
  • తమ్ముడు సినిమా షూటింగ్ కోసం 78 రోజులు అడవిలోనే ఉన్నామన్న హీరో నితిన్
  • పిల్లలు బాగా డ్యాన్స్ చేశారని ప్రశంసించిన నితిన్
  • పిల్లల కంటే వారి తల్లులు డ్యాన్స్ అదరగొట్టారన్న నితిన్
హీరో నితిన్ 'తమ్ముడు' సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన 'తమ్ముడు' చిత్రం జులై 4న విడుదల కానుంది. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నితిన్, లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రలు పోషించారు.

ఇటీవల ఈ సినిమాలోని 'భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ' అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నితిన్ మాట్లాడుతూ, సినిమా షూటింగ్ కోసం 78 రోజులు అడవిలోనే ఉన్నామని తెలిపారు.

చిన్నారులందరూ చక్కగా డ్యాన్స్ చేశారని అభినందించారు. పిల్లల డ్యాన్స్ కంటే వారి తల్లులు అద్భుతంగా డ్యాన్స్ చేశారని, సింగిల్ టేక్‌లో చాలా బాగా చేశారని నితిన్ ప్రశంసించారు. జులై 4న విడుదల కానున్న 'తమ్ముడు' సినిమా చాలా బాగుంటుందని, అందరూ చూడాలని ఆయన కోరారు. 
Nithin
Thammudu Movie
Sriram Venu
Dil Raju
Laya
Sapthami Gowda
Varsha Bollamma
Telugu Cinema
Bhuvantu Butham Vaste
Movie Release

More Telugu News