Mahwash: 19 ఏళ్లకే నిశ్చితార్థం.. 21 ఏళ్లకు రద్దు: షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆర్జే మహ్వష్

RJ Mahwash on Yuzvendra Chahal Trolling Career Engagement
  • టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌తో సన్నిహితంగా ఆర్జే మహ్వష్‌ 
  • చాహల్ వల్లే కెరీర్ అంటూ వస్తున్న ఆరోపణలపై మహ్వష్ ఘాటు స్పందన
  • తన కెరీర్ టైమ్‌లైన్‌ను షేర్ చేసి, ఆధారాలతో సమాధానమిచ్చిన వైనం
  • ప్రస్తుతం తాను సింగిల్ అని, పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసిన మహ్వష్
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌తో సన్నిహితంగా ఉంటున్న రేడియో జాకీ (ఆర్జే) మహ్వష్ తనపై చేస్తున్న ట్రోలింగ్‌పై ఎట్టకేలకు మౌనం వీడింది. చాహల్‌తో ఉన్న పరిచయం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, తన కెరీర్ ఎదుగుదలకు అతడే కారణమంటూ వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ తన ప్రస్థానం గురించి ఆధారాలతో సహా వివరణ ఇచ్చింది. 

ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో, అలాగే ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతుగా యజువేంద్ర చాహల్‌తో కలిసి మహ్వష్ కనిపించడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. అప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో కొందరు తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు. చాహల్‌తో సంబంధమే ఆమె కెరీర్‌కు పునాది వేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహ్వష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది.

"మీ కోసం మీరు మాట్లాడకపోతే, మీ కోసం ఎవరూ మాట్లాడరు" అనే క్యాప్షన్‌తో తన కెరీర్ ప్రగతిని వివరించింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ "నేను 2019 నుంచి ఈ రంగంలో ఉన్నాను. ఇదంతా జరగకముందు నేనేం చేశానో మీకు చూపిస్తాను రండి" అంటూ తన కెరీర్ మైలురాళ్లను వివరించింది. తన కష్టార్జితంతోనే ఈ స్థాయికి వచ్చానని, చాహల్‌తో స్నేహానికి, తన కెరీర్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది.

 నేను సింగిల్.. పెళ్లిపై నమ్మకం లేదు 
కొన్ని నెలల క్రితం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మహ్వష్ తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై స్పష్టత ఇచ్చింది. తాను సింగిల్ అని, ఈ రోజుల్లో పెళ్లి అనే కాన్సెప్ట్‌ తనకు అంతగా అర్థం కావడం లేదని పేర్కొంది. తాను సాధారణంగా ఎవరితోనూ డేటింగ్‌కు వెళ్లనని, ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటానో వారితోనే డేటింగ్‌కు వెళ్తానని చెప్పుకొచ్చింది.  

19 ఏళ్లకే నిశ్చితార్థం.. తర్వాత రద్దు
అదే పాడ్‌కాస్ట్‌లో మహ్వష్ ఒక షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించింది. తనకు 19 ఏళ్ల వయసులోనే నిశ్చితార్థం జరిగిందని, 21 ఏళ్ల వయసులో దానిని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అందుకే, భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లేని ఏ విషయంలోనూ తొందరపడనని వివరించింది. తాను అలీగఢ్ లాంటి చిన్న పట్టణంలో పెరిగానని, అక్కడ ఒక మంచి భర్తను చూసుకుని పెళ్లి చేసుకోవడమే తన లక్ష్యంగా ఉండేదని పేర్కొంది.
Mahwash
RJ Mahwash
Yuzvendra Chahal
Chahal
Radio Jockey
dating rumors
Punjab Kings
IPL 2025
engagement cancelled
relationship status

More Telugu News