Israel: ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు

Israel Missile Strikes on Iran Nuclear Sites



ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసే లక్ష్యంతో, ఆ దేశంలోని ఖొండాబ్ అణు పరిశోధనా రియాక్టర్ సమీపంలోని ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు సమాచారం. అయితే, దాడికి ముందే సదరు కేంద్రాన్ని ఖాళీ చేయించామని, రేడియేషన్ ప్రమాదం ఏమీ లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు, ఇరాన్‌లోని కీలక అణు కేంద్రానికి నిలయమైన ఇస్ఫహాన్ నగరంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ రోజు ఉదయం వెల్లడించింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) కూడా మధ్య ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ వ్యవస్థలు, నిల్వ కేంద్రాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయని ధ్రువీకరించాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన 15కు పైగా డ్రోన్లను అడ్డగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది.
Israel
Iran
Iran nuclear program
Israel missile strike
Khondab nuclear research reactor
Isfahan
IDF
Middle East conflict
Nuclear facilities
Drone attack

More Telugu News