Jagan Mohan Reddy: యోగా దినోత్సవం సందర్భంగా జగన్ సందేశం

- దేశ వ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
- ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఉపయోగపడుతుందన్న జగన్
- యోగాను జీవితంలో ఒక భాగం చేసుకుందామని పిలుపు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. కోట్లాది మంది ప్రజలు యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు. యోగా మన శరీరం, ఆత్మ రెండింటిపై పని చేస్తుందని తెలిపారు. అలాంటి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రతిరోజు కాసేపు యోగా చేద్దామని సూచించారు.