Adi Srinivas: చంద్రబాబుతో చర్చలు జరుపుతామంటే ఉలుకెందుకు?: ఆది శ్రీనివాస్

Adi Srinivas Questions BRS Leaders on Chandrababu Meeting Concerns
  • బనకచర్ల విషయంలో పాపం కేసీఆర్, హరీశ్ రావుదేనన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • గతంలో జగన్‌తో మంతనాలు జరిపి వారే ద్వారాలు తెరిచారని ఆరోపణ
  • రైతుల దృష్టి మళ్లించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శ
  • రాష్ట్రంలో కేసీఆర్, హరీశ్‌రావు చిల్లర పంచాయితీలు పెడుతున్నారని వ్యాఖ్య
  • తాము చంద్రబాబుతో చర్చలు జరిపితే బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత ఆందోళన అని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చలు జరుపుతామని తాము చెబితే బీఆర్ఎస్ నాయకులకు ఎందుకంత ఉలుకు అని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బనకచర్ల విషయంలో గత పాలకులు కేసీఆర్, హరీశ్ రావుదే పూర్తి బాధ్యత అని ఆయన అన్నారు.

ఆనాడు జగన్‌తో రహస్య మంతనాలు జరిపి, వారే స్వయంగా అన్ని ద్వారాలు తెరిచారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "బనకచర్ల విషయంలో ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు, అప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా? కేసీఆర్, హరీశ్ రావు అప్పట్లో జగన్‌తో చర్చలు జరపలేదా? వారే కదా అన్నింటికీ తలుపులు తెరిచింది?" అని ప్రశ్నించారు. రైతుల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ నేతలు బనకచర్ల అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకు తెస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.

రాష్ట్రంలో అనవసరంగా చిల్లర పంచాయితీలు సృష్టిస్తూ, రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్, హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి చర్యల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని ఆది శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, బీఆర్ఎస్ నేతల డ్రామాలను నమ్మరని ఆయన అన్నారు.
Adi Srinivas
Chandrababu Naidu
BRS Leaders
Banakacherla
KCR
Harish Rao
YS Jagan
Andhra Pradesh

More Telugu News