Koushik Reddy: కౌశిక్ అరెస్ట్ పై హరీశ్ స్పందన... కేటీఆర్ ను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపాటు

Harish Rao Reacts to Koushik Reddy Arrest
  • హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్
  • ఇది కక్ష సాధింపు చర్యేనన్న మాజీ మంత్రి హరీష్‌రావు
  • రేవంత్ సర్కార్‌పై హరీష్‌రావు తీవ్ర విమర్శలు
గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సుబేదారి పోలీసులు, అనంతరం వరంగల్‌కు తరలించారు. ఈ అరెస్టుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కౌశిక్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దొంగ కేసు బనాయించి, ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుందని, నిద్రలో కూడా ఆయన పేరే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫార్ములా వన్ రేసును రాష్ట్రానికి తీసుకొచ్చిన కేటీఆర్‌ను కూడా ప్రస్తుత ప్రభుత్వం సతాస్తోందని మండిపడ్డారు. శని, ఆదివారాల్లో అరెస్టులు చేయవద్దని హైకోర్టు పలుమార్లు చెప్పినా, కౌశిక్‌రెడ్డి విషయంలో పోలీసులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం సీఎం కుర్చీ విలువను కూడా తీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Koushik Reddy
Harish Rao
BRS Party
Revanth Reddy
KTR
Telangana Politics
Arrest
Granite Quarry
Farmer Support
Telangana Government

More Telugu News