Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు

Sajjala Ramakrishna Reddy Criticizes Chandrababus Governance
  • రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణ
  • చంద్రబాబు తప్పులను జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ రైతుల సమస్యలపై తక్షణం స్పందించి, గిట్టుబాటు ధర కల్పించేవారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని, వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారని సజ్జల ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులు వేధిస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన తప్పులను ఇతరులపై, ముఖ్యంగా జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, వీటిపై ప్రజల పక్షాన వైసీపీ నిరంతరం ప్రశ్నిస్తూనే, పోరాడుతూనే ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. కేవలం మీడియా హైప్‌తోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 
Sajjala Ramakrishna Reddy
Chandrababu Naidu
YS Jaganmohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Farmer Issues
Ganja Smuggling
Law and Order
Political Criticism
Telugu News

More Telugu News