Kannappa: 'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇవిగో!

- హైదరాబాదులో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్
- కన్నప్ప' సినిమా కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న మంచు విష్ణు
- ఇది విష్ణు సినిమా కాదు, కన్నప్ప సినిమా అని వ్యాఖ్య
- శివుడి అనుగ్రహంతోనే ఇంతమంది నటులు భాగమయ్యారన్న విష్ణు
- సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించిన మోహన్ బాబు, శరత్ కుమార్
- జూన్ 27న 'కన్నప్ప' ప్రేక్షకుల ముందుకు!
తాను ప్రధాన పాత్రలో నటిస్తూ, ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' సినిమా ప్రయాణంలో మాటల్లో చెప్పలేనన్ని బాధలు, కష్టాలు ఎదుర్కొన్నామని నటుడు మంచు విష్ణు అన్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.
భగవంతుడి ఆశీస్సులతోనే ఈ చిత్రం: మోహన్ బాబు
ఈ వేడుకలో పాల్గొన్న సీనియర్ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, "ఇదంతా భగవంతుని ఆశీస్సులు. ప్రతి కదలిక ఆయన నిర్ణయమే. మనం నిమిత్తమాత్రులం. మంచి చిత్రాన్ని తీశాం, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకు ఉండాలి" అని కోరారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ హీరోలేనని, వారందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. దర్శకుడు ముఖేష్ సింగ్ 'మహాభారతం' సీరియల్‌ను అద్భుతంగా తీశారని, ఈ సినిమాకు కూడా ఆయనే రథసారథి అని ప్రశంసించారు. తిన్నడు ఎలా కన్నప్ప అయ్యాడన్నదే ఈ చిత్ర కథాంశమని, నీతిగా బతికిన బోయవాడి కథ ఇదని వివరించారు.
శివుడి అనుగ్రహంతోనే 'కన్నప్ప' సాధ్యమైంది: మంచు విష్ణు
మంచు విష్ణు మాట్లాడుతూ, "2014లో 'కన్నప్ప' కథ హక్కులు పొందాను. ఆ తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. శివుడి అనుగ్రహం వల్లే ఇంతమంది గొప్ప నటులు ఈ చిత్రంలో భాగమయ్యారని నమ్ముతున్నాను. ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ సమయంలో చూసి, 'ఇలాంటి చిత్రాన్ని నేను చేయగలిగానా?' అని ఆశ్చర్యపోయాను" అని అన్నారు. సంగీత దర్శకుడు స్టీఫెన్‌ను ఎంపిక చేసుకున్న విధానాన్ని, సినిమాకు సహాయపడిన పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, శివ బాలాజీ, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారికి కృతజ్ఞతలు తెలిపారు. శరత్ కుమార్ తనకు తండ్రితో సమానమని, ఆయన వల్లే తమిళంలో ఈ సినిమా భారీగా విడుదలవుతోందని, న్యూజిలాండ్ చిత్రీకరణలో కూడా ఆయన సహాయం మరువలేనిదని పేర్కొన్నారు.
"ఈ సినిమా సులభంగా పూర్తికాలేదు. చెప్పలేనన్ని బాధలు పడ్డాం. 'అసలు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?' అని శివరాజ్ కుమార్ గారు ఓ సందర్భంలో అడిగారు. 'తెలుగు తెరపై కన్నప్ప కనిపించి దాదాపు 50 ఏళ్లు అయింది. ఈ తరానికి వాయులింగం, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నన్ను ఆదేశించాడు. ఆయన అనుగ్రహంతో ఈ చిత్రాన్ని తీస్తున్నా' అని ఆయనతో చెప్పాను" అంటూ విష్ణు తన మనోగతాన్ని పంచుకున్నారు. ఒకవేళ దర్శకత్వం చేసే అవకాశం వస్తే మోహన్ లాల్‌తో సినిమా తీస్తానని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
మోహన్ బాబు ధైర్యానికి హ్యాట్సాఫ్: ముఖేశ్ కుమార్ సింగ్
దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, "గత రెండున్నరేళ్లుగా హైదరాబాద్ నా సొంత ఇల్లుగా మారిపోయింది. మోహన్ బాబు గారి వల్లే ఇక్కడికి వచ్చాను. ఆయన ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్. ఆయన పైన కఠినంగా కనిపించినా, లోపల చాలా మృదువైన, స్వచ్ఛమైన వ్యక్తి. విష్ణు లాంటి నటుడితో నేనెప్పుడూ పనిచేయలేదు. చాలా తక్కువ టేక్‌లలోనే అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఏ పాత్ర కూడా అతిథిలా వచ్చి వెళ్లేది కాదు. ప్రభాస్ రెబల్ స్టార్ మాత్రమే కాదు, హంబుల్ స్టార్ కూడా" అని అన్నారు.
సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయొద్దు: శరత్ కుమార్
నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ, "నేను ఎంతో మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. కానీ బ్రహ్మానందం గారు అంతా మాట్లాడేశారు. శివాజ్ఞతోనే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. మోహన్ బాబు నాకు అన్నయ్య లాంటి వారు, విష్ణు నా కుమారుడి లాంటి వాడు. వారి వల్లే 'కన్నప్ప' సాధ్యమైంది. నేటి యువతలో దేవుడిపై విశ్వాసం తగ్గుతోంది, ఈ చిత్రంతో అది మళ్లీ పెరుగుతుందని ఆశిస్తున్నాను. చరిత్రలో గొప్పవాళ్లను మనం మర్చిపోతున్నాం. అలాంటి వారిని గుర్తుచేయడానికే మోహన్ బాబు ఈ సినిమా తీశారు. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. దయచేసి నెగెటివ్ ప్రచారం చేయొద్దు. సినిమా కోసం పడిన కష్టాన్ని చూడండి" అని విజ్ఞప్తి చేశారు.
బ్రహ్మానందం చమత్కారాలు.. మోహన్ బాబుపై సరదా వ్యాఖ్యలు
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలిస్తూ నవ్వులు పూయించారు.
ఈ సందర్భంగా సుమ అడిగిన పలు ప్రశ్నలకు బ్రహ్మానందం ఫన్నీగా జవాబిచ్చారు. "మోహన్ బాబు, విష్ణు.. ఇద్దరిలో ఎవరు అందగాడు?" అని సుమ ప్రశ్నించగా, "విష్ణు మోస్ట్ హ్యాండ్సమ్" అని బ్రహ్మానందం అన్నారు. "మోహన్ బాబు సినిమాని మీరు రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారు?" అన్న ప్రశ్నకు, "'అసెంబ్లీ రౌడీ'. ఆ సినిమా కోసం ముందుగా నన్నే సంప్రదించారు. ఆ సబ్జెక్ట్ మనకెందుకులే అనుకుని తిరస్కరించా. 'నాకు ఆ అవకాశం కల్పించండి' అని మోహన్ బాబు మా ఇంటికొచ్చి ప్రాధేయపడితే ఇచ్చేశా" అంటూ సరదాగా వ్యాఖ్యానించి నవ్వించారు. 'యమదొంగ'లో యముడి పాత్ర కోసం మొదట మిమ్మల్నే అనుకున్నారట కదా అని అడగ్గా, "లేదు. యముడి పాత్రకు మోహన్ బాబే సరిగ్గా సరిపోతారు... సినిమాల్లోనూ, బయట కూడా ఆయన అలాగే ఉంటారు" అని బదులిచ్చారు.
అనంతరం, "మోహన్ బాబులో మీకు నచ్చే, నచ్చని విషయాలు ఏంటి?" అని సుమ ప్రశ్నించగా, "నచ్చేది, నచ్చనిది రెండూ లేవు. అసలు నాకు మోహన్ బాబే నచ్చడు" అంటూ బ్రహ్మానందం సరదాగా చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. అయితే, మోహన్ బాబుతో తనకున్న చనువుతోనే అలా సరదాగా మాట్లాడానని, ఆయన గొప్ప నటుడని, 'కన్నప్ప' కోసం ఆయన, విష్ణు ఎంతో కష్టపడ్డారని బ్రహ్మానందం స్పష్టం చేశారు.
ఈ సినిమా ఆలోచన పరమేశ్వరుడిదని, ప్రజల్లో భక్తి సన్నగిల్లుతున్న ఈ తరుణంలో సాక్షాత్తూ శివుడే 'నా సినిమా తీయ్' అని మోహన్ బాబుకు చెప్పి ఉంటారని బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. డబ్బు కోసం తీసే సినిమాలను నచ్చకపోతే విమర్శించినా ఫర్వాలేదని, కానీ ఇలాంటి భక్తి ప్రధానమైన చిత్రాలను తప్పకుండా ఆదరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ గురించి మాట్లాడుతూ, డబ్బు కోసమో, అద్భుతమైన పాత్ర కోసమో కాకుండా, కేవలం మానవతా విలువలతో, మోహన్ బాబుపై ఉన్న అభిమానంతోనే ఈ సినిమా చేశారని కొనియాడారు.