Manchu Vishnu: కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

Manchu Vishnu Comments on Prabhas at Kannappa Pre Release Event
  • ఈ నెల 27న విడుదల కానున్న కన్నప్ప
  • ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించిన విష్ణు
  • ప్రభాస్ తనకు కృష్ణుడు లాంటి వాడన్న విష్ణు
కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్‌పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తిన్నడుగా మంచు విష్ణు, రుద్రగా ప్రభాస్ నటించారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ గురించి విష్ణు ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు విష్ణు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు లాంటి వాడని అన్నారు. వాస్తవానికి ప్రభాస్‌కు ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేదని కానీ, మా నాన్న మోహన్ బాబుపై ఉన్న ప్రేమతో నటించాడని విష్ణు పేర్కొన్నారు.

ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని విష్ణు అన్నారు. మానవత్వం కలిగి ఉన్న ప్రభాస్ నుంచి ఈ తరం చాలా విషయాలు నేర్చుకోవాలన్నారు. డబ్బు, పేరు రాగానే కొందరు మారిపోతుంటారని, కానీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ ఇప్పటికీ మారలేదని విష్ణు కొనియాడారు. 
Manchu Vishnu
Kannappa Movie
Prabhas
Mohan Babu
Mukesh Kumar Singh
Telugu Cinema
Pre Release Event
Tollywood
Kannappa Release Date

More Telugu News