Iran crisis: ఇరాన్ సంక్షోభం: పొరుగు దేశాలకు అండగా భారత్

Sri Lanka thanks India for evacuating citizens from Iran
  • ఇరాన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీలంక పౌరుల తరలింపులో భారత్ చేయూత
  • సకాలంలో సాయం అందించిన భారత ప్రభుత్వానికి శ్రీలంక కృతజ్ఞతలు
  • ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమన్న శ్రీలంక
  • భారతీయులతో పాటు శ్రీలంక, నేపాల్ పౌరుల తరలింపునకూ భారత్ చర్యలు
  • 'ఆపరేషన్ సింధు' ద్వారా కొనసాగుతున్న సహాయక చర్యలు
ఇజ్రాయెల్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఇరాన్ నుంచి తమ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయపడినందుకు శ్రీలంక శనివారం భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. భారతీయులతో పాటు శ్రీలంక పౌరులను కూడా ఇరాన్ నుంచి తరలించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చొరవను శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.

ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ "ఇరాన్ నుంచి శ్రీలంక పౌరులను భారతీయులతో పాటు తరలించడానికి సకాలంలో సహాయం అందించిన భారత ప్రభుత్వానికి శ్రీలంక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది" అని పేర్కొన్నారు. ఈ సహాయం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన, చిరకాల భాగస్వామ్యానికి నిదర్శనమని, దీనిని శ్రీలంక ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారని ఆయన తెలిపారు.

అంతకుముందు, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం, నేపాల్, శ్రీలంక ప్రభుత్వాల అధికారిక అభ్యర్థనల మేరకు, ఆయా దేశాల పౌరులను కూడా తరలింపు ప్రక్రియలో చేర్చినట్టు ప్రకటించింది. "నేపాల్, శ్రీలంక ప్రభుత్వాల అభ్యర్థన మేరకు, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తరలింపు ప్రయత్నాలలో ఆయా దేశాల పౌరులనూ కవర్ చేస్తుంది" అని రాయబార కార్యాలయం 'ఎక్స్'లో పేర్కొంది. 
Iran crisis
India
Sri Lanka
Nepal
Israel
Tehran
Indian Embassy
Evacuation
Foreign Ministry
Middle East tensions

More Telugu News