Kerala Bus Accident: బస్టాప్ లో మహిళలపైకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో ఇదిగో!

Kerala Bus Accident Three Women Injured at Bus Stop
--
బస్టాప్ లో వేచి ఉన్న మహిళలపైకి ఓ బస్సు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం కేరళలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. త్రిసూర్ లోని చోవూర్ బస్టాండ్ లో ముగ్గురు మహిళలు బస్సు కోసం వేచి ఉన్నారు. వర్షం పడుతుండడంతో గొడుగులతో నిల్చున్నారు. ఇంతలో ఓ బస్సు అటుగా వస్తూ అదుపుతప్పింది.

బస్టాప్ ముందు నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. బస్సు మీదికి వస్తుండడంతో తప్పించుకునేందుకు ఆ మహిళలు విఫలయత్నం చేశారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ అక్కడ నుంచి పరారయ్యాడు.
Kerala Bus Accident
Kerala
Bus accident
Thrissur
Chavakkad
Road accident
Bus stand accident
CCTV footage

More Telugu News