Seyed Abbas: శాశ్వతంగా గుర్తుండిపోయేలా దెబ్బకొడతాం.. అమెరికాకు ఇరాన్ మంత్రి వార్నింగ్

Iran warns US of permanent damage after nuclear site attacks
--
ఫోర్డో సహా తమ దేశంలోని మూడు అణుకేంద్రాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరోపించారు. తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దాడులు చేసిన అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఈ దాడులకు ప్రతీకారంగా తాము చేయబోయే గాయం అమెరికాకు శాశ్వతంగా గుర్తుండిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా ఇలా నేరపూరితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇటువంటి నేరపూరిత ప్రవర్తన ఉన్న అగ్రరాజ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐరాసలోని సభ్యులకు అబ్బాస్‌ సూచించారు. యూఎన్‌ చార్టర్ ప్రకారం.. ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. అమెరికా ప్రవర్తనను ఖడించాలని ప్రపంచ దేశాలకు అబ్బాస్ పిలుపునిచ్చారు.
Seyed Abbas
Iran
America
nuclear facilities
Fordow
UN Security Council
foreign minister
US attack
international law
retaliation

More Telugu News