Mahesh Kumar Goud: కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Alleges KCR and KTR Involvement in Phone Tapping
  • గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ల ట్యాపింగ్ అని మహేశ్ గౌడ్ ఆరోపణ
  • ట్యాపింగ్ బాధితుల జాబితా బయటపెట్టాలని వ్యాఖ్యలు
  • దోషులు ఎంతటివారైనా జైలుకు పంపడం ఖాయం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లదే పూర్తి బాధ్యత అని, వారి ప్రమేయం, కనుసన్నలతోనే ఈ మొత్తం వ్యవహారం నడిచిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఘాటుగా స్పందించారు. "గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, పలువురు పారిశ్రామికవేత్తల ఫోన్లను విచక్షణారహితంగా ట్యాప్ చేసిన పాపం బీఆర్ఎస్‌దే. కేవలం ప్రతిపక్షాలనే కాకుండా, సొంత పార్టీ నేతలను కూడా వారు వదల్లేదు. ఈ అక్రమ దందా అంతా కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలు, వారి ప్రమేయంతోనే జరిగిందని మేము బలంగా విశ్వసిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తక్షణమే బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. "ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని గౌడ్ స్పష్టం చేశారు.


Mahesh Kumar Goud
KCR
KTR
Telangana phone tapping
BRS government
Telangana Congress
Phone tapping case
Telangana politics
TPCC Chief
SIT investigation

More Telugu News