Pawan Kalyan: తన రియల్ లైఫ్ క్యారెక్టర్ తో సినిమా... పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

Pawan Kalyan on Real Life Character in Cinema
  • పూర్తిగా నచ్చిన పాత్ర ఇంకా చేయలేదన్న పవన్
  • నిజ జీవితంలా తెరపై కనిపించాలనుంది కానీ సాధ్యం కాదన్న డిప్యూటీ సీఎం
  • నాన్న వల్లే రాజకీయాలపై ఆసక్తి కలిగిందన్న పవన్
  • అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా.. సమాజంపైనే దృష్టి ఉండేదన్న జనసేనాని
  • 'దంగల్' లాంటి చిత్రాలు బాలీవుడ్‌లో రావడం లేదని వ్యాఖ్య
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సినీ, రాజకీయ ప్రస్థానంపై పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ఏ ఒక్కటీ తనకు పూర్తిస్థాయిలో సంతృప్తినివ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ఇప్పటిదాకా నేను చేసిన ఏ పాత్ర కూడా నా మనసుకు పూర్తిగా దగ్గరవ్వలేదు. ప్రతి పాత్రలోనూ కొన్ని అంశాలు మాత్రమే నాకు నచ్చాయి. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో, తెరపైనా అలాగే కనిపించాలని నా కోరిక. కానీ, సినిమాల్లో అది కుదరకపోవచ్చు. అలాంటి సినిమాకు జనాదరణ లభించదేమో!" అని అన్నారు.

భారతీయ సినిమా రంగం గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు బాలీవుడ్‌లో దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు వచ్చేవని గుర్తుచేశారు. "ప్రస్తుతం 'దంగల్' వంటి ప్రభావవంతమైన సినిమాలు రావడం లేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగిన కథలను అందించడంలో వారు వెనుకబడుతున్నారేమో!" అని అభిప్రాయపడ్డారు.

నటన నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి పవన్ వివరిస్తూ, తన తండ్రి తనకు స్ఫూర్తి అని తెలిపారు. "నేను నటుడిని కావాలని గానీ, సినిమాల్లోకి రావాలని గానీ ఎప్పుడూ అనుకోలేదు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, ఆయనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేది. ఆయన ప్రభావం వల్లే మా కుటుంబ సభ్యులందరికీ రాజకీయాలపై కొంత అవగాహన ఏర్పడింది. నేను అనుకోకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టినా, నా దృష్టి ఎప్పుడూ సమాజంపైనే ఉండేది. ఆ ఆలోచనల నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించాను" అని పవన్ కల్యాణ్ వివరించారు.

Pawan Kalyan
Pawan Kalyan movies
Andhra Pradesh Deputy CM
Tollywood
Indian cinema
Bollywood
Dangal movie
political journey
family background
communist ideology

More Telugu News