Nagarjuna: తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

Nagarjuna Clarifies His Comments on Kubera Movie
  • కుబేర మూవీపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారన్న నాగార్జున
  • ఇది ముమ్మాటికీ శేఖర్ కమ్ముల మూవీనేనని స్పష్టీకరణ
  • మూవీ సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చిన నాగార్జున
"కుబేర" మూవీ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని నాగార్జున వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన "కుబేర" సినిమా సక్సెస్ మీట్‌లో గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పష్టత ఇచ్చారు.

శేఖర్ కమ్ముల కథ చెబుతున్న సమయంలోనే దీపక్ పాత్ర చుట్టూ ఇతర పాత్రలు తిరుగుతాయని చెప్పారని, అందుకే ప్రెస్ మీట్‌లో ఇది తన (దీపక్) సినిమా అని అన్నానని నాగార్జున తెలిపారు. అయితే, దానిని వక్రీకరిస్తూ సినిమా విడుదలకి ముందు శేఖర్ కమ్ముల సినిమా అని చెప్పి, ఇప్పుడేమో నా సినిమా అంటున్నాడని కొన్ని మీమ్స్ కూడా కనిపించాయని ఆయన అన్నారు.

కొన్ని వెబ్‌సైట్స్‌లో ఈ మేరకు వార్తలు వచ్చాయని నాగార్జున పేర్కొన్నారు. ఇది దేవా (ధనుష్) సినిమా, అలాగే దీపక్, సమీర (రష్మిక) సినిమా అని, అంతేకాకుండా సినిమాలో నటించిన అందరి సినిమా అని, అన్నింటికీ మించి ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల సినిమా అని స్పష్టం చేస్తూ ఆయన దర్శకత్వాన్ని నాగార్జున ప్రశంసించారు. 
Nagarjuna
Kubera Movie
Sekhar Kammula
Dhanush
Rashmika Mandanna
Deepak
Telugu Cinema
Movie Success Meet
Hyderabad
Tollywood

More Telugu News