Ali Khamenei: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ వార్నింగ్.. తగిన శాస్తి తప్పదన్న ఖమేనీ

Enemy made grave big mistake must be punished Khamenei on US strikes
  • అమెరికా దాడుల‌ను తీవ్రంగా ఖండించిన ఖ‌మేనీ
  • అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్ర హెచ్చరిక
  • శత్రువులు తమ దుందుడుకు చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్య
  • 'జయోనిస్ట్ శత్రువు శిక్ష అనుభవిస్తున్నాడు' అంటూ ఎక్స్ వేదికగా ఖమేనీ పోస్ట్‌
తమ దేశంలోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయ‌డంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రతిస్పందన కఠినంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన సోమవారం ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా హెచ్చరించారు. ఈ దుందుడుకు చర్యకు పాల్పడిన శత్రువులు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారని ఆయన ప్రతినబూనారు.

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఖమేనీ తొలిసారిగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. "శిక్ష కొనసాగుతోంది. జయోనిస్ట్ శత్రువు (ఇజ్రాయెల్) చాలా పెద్ద తప్పు చేసింది. ఘోరమైన నేరానికి పాల్పడింది. దానికి శిక్ష పడుతోంది. అది త‌ప్ప‌కుండా శిక్ష అనుభవిస్తుంది" అని ఖమేనీ తన పోస్టులో పేర్కొన్నారు.

ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో కొంతకాలంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా దాడుల ఆరోపణలతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిచర్యలు ఉంటాయోనన్న ఆందోళన అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతోంది.

Ali Khamenei
Iran
Israel
America
Nuclear facilities
Attack
Warning
Retaliation
Middle East tensions
US

More Telugu News