Crime: స్నేహం పేరుతో బాలికను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన బాలుడు

Adilabad Boy Recorded Nude Video Of A Girl
  • ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఘటన
  • సోషల్ మీడియాలో పరిచయమైన బాలిక
  • ఇద్దరి మధ్య చాటింగ్‌ను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించిన బాలుడు 
  • నగ్న వీడియోను స్నేహితులకు షేర్ చేసిన నిందితుడు
  • ఇద్దరు బాలురు సహా 8 మంది అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఓ బాలుడు (16) దారుణానికి తెగబడ్డాడు. సోషల్ మీడియాలో పరిచయమైన బాలిక (16)ను బెదిరించి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. ఆపై వాటిని తన స్నేహితులకు షేర్ చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు మైనర్లు సహా మొత్తం 8 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడికి సోషల్ మీడియా ద్వారా బాధిత బాలిక పరిచయమైంది. ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్‌ను ఉపయోగించుకున్న బాలుడు.. దానిని ఆమె తల్లిదండ్రులకు చూపించకుండా ఉండాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక అలాగే చేసింది. ఆ వీడియోను రికార్డు చేసిన బాలుడు దానిని తన స్నేహితులకు షేర్ చేశాడు. 

ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. బాలికను మానసికంగా, శారీరకంగా వేధించిన ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇద్దరు బాలురను నిజామాబాద్‌లోని జువైనల్ హోంకు, మిగిలిన వారిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. 
Crime
Adilabad
Telangana
Nude Video Crime News
Adilabad News

More Telugu News