Jasprit Bumrah: బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు సమం

Jasprit Bumrah Creates History Equals Kapil Dev Record
  • 'సెనా' దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా బుమ్రా రికార్డ్
  • ఇంగ్లండ్ తో టెస్టులో 5 వికెట్లతో సత్తా చాటిన భారత పేసర్
  • సెనా దేశాల్లో 10వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత బౌలర్
  • విదేశీ టెస్టుల్లో 12వ సారి ఐదు వికెట్లు.. కపిల్ దేవ్ రికార్డు సమం
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA-సెనా) దేశాల్లో కలిపి 150 వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. 

'సెనా' దేశాల్లో బుమ్రా జోరు
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో దాదాపు ఒంటరి పోరాటం చేసిన బుమ్రా 24.4 ఓవర్లలో 83 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సెనా దేశాల్లో బుమ్రాకు ఇది పదో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ కూడా బుమ్రానే. మరో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్ (సెనా దేశాల్లో 11 సార్లు ఐదు వికెట్లు) రికార్డును బుమ్రా అధిగమిస్తాడు.

అంతేగాక‌ విదేశీ గడ్డపై టెస్టుల్లో బుమ్రాకు ఇది 12వ ఐదు వికెట్ల ఘనత. దీంతో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. అయితే, కపిల్ దేవ్ 66 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా, బుమ్రా కేవలం 34 టెస్టుల్లోనే ఈ ఫీట్ అందుకోవడం విశేషం. బుమ్రా ఆస్ట్రేలియాలో నాలుగు సార్లు, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో చెరో మూడు సార్లు, వెస్టిండీస్‌లో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత్‌లో కేవలం రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్లు తీశాడు.
Jasprit Bumrah
Bumrah
Kapil Dev
SENA countries
India cricket
Indian bowler
Test cricket
Waseem Akram
Cricket records
Leeds Test

More Telugu News