Dmitry Medvedev: ఇరాన్ కు అణ్వాయుధాలు అందించేందుకు చాలా దేశాలు రెడీ: దిమిత్రి మెద్వెదేవ్

Dmitry Medvedev says Many countries ready to provide nuclear weapons to Iran
  • రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ వ్యాఖ్య
  • దాడులతో అమెరికా సాధించింది శూన్యమన్న రష్యా మాజీ అధ్యక్షుడు
  • అమెరికా కొత్త యుద్ధానికి తెరలేపిందని విమర్శలు
ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించేందుకే ఈ దాడులు చేశామని అమెరికా పేర్కొంది. అయితే, ఇరాన్ కు నేరుగా తమ అణ్వాయుధాలను అందించేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ పేర్కొన్నారు. అమెరికా వైమానిక దాడులపై మెద్వెదేవ్ టెలిగ్రామ్ వేదికగా స్పందించారు. ఇరాన్ అణుకేంద్రాలపై జరిపిన దాడులతో అమెరికా పెద్దగా సాధించిందేమీ లేదని, అణుకేంద్రాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దాడుల ద్వారా మధ్యప్రాచ్యంలో మరో కొత్త యుద్ధానికి అమెరికా తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ఆయా ప్రాంతాల్లో "అణు పదార్థాల శుద్ధి, భవిష్యత్తులో అణ్వాయుధాల తయారీ కొనసాగుతుంది" అని మెద్వెదేవ్ అభిప్రాయపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్‌లో రాజకీయ పాలన మరింత బలపడిందని ఆయన విశ్లేషించారు.

దౌత్యానికి దారులు మూసేసింది..
ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చల్లో తిరిగి చేరే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్‌చి స్పష్టం చేశారు. "మేము అమెరికాతో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఇజ్రాయిల్ వాటిని దెబ్బతీసింది. ఈసారి అమెరికన్లు వాటిని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఇరాన్ కాదు, అమెరికాయే దౌత్యానికి, చర్చలకు వెన్నుపోటు పొడిచింది" అని ఆయన అన్నారు. ట్రంప్ పరిపాలన భవిష్యత్ శాంతి కార్యక్రమాలకు అనర్హమైనదని, వారు బెదిరింపులు, బలప్రయోగాల భాషను మాత్రమే అర్థం చేసుకుంటారని అరఘ్‌చి విమర్శించారు.
Dmitry Medvedev
Iran nuclear program
US airstrikes Iran
Russia Iran relations
Middle East conflict
Iran nuclear weapons
Araghchi Iran foreign minister
Iran US tensions
nuclear proliferation
Iran nuclear deal

More Telugu News