Dhondiram Bhosale: నీట్ లో ర్యాంక్ రాలేదని కూతురును చితకబాదిన తండ్రి.. మహారాష్ట్రలో బాలిక మృతి

NEET Failure Leads to Fathers Violence Daughter Dies in Sangli
  • సాంగ్లీ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపాల్ దారుణం
  • కర్రతో కొట్టి, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా యోగా డేకు వెళ్లిన తండ్రి
  • నిందితుడు ధోండిరామ్ భోసలే అరెస్ట్
వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ లో తక్కువ మార్కులు తెచ్చుకుందనే కోపంతో ఓ తండ్రి తన కూతురిని చితకబాదాడు. కర్రతో దాడి చేయగా కూతురు రక్తపుమడుగులో కుప్పకూలింది. అయినప్పటికీ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా యోగా డే కార్యక్రమానికి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆ బాలిక చనిపోయింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో మృతురాలి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితుడు ఓ స్కూలుకు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తుండడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. సాంగ్లీ జిల్లాకు చెందిన ధోండిరామ్ భోసలే ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. ధోండిరామ్ కూతురు 12వ తరగతి పూర్తిచేసింది. ఇటీవల నీట్ పరీక్ష రాసింది. అయితే, తక్కువ మార్కులు స్కోర్ చేయడంతో ఆమెకు సీటు రాలేదు. దీంతో ధోండిరామ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కూతురును కర్రతో దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, అతను తన పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ధోండిరామ్ భోసలేను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Dhondiram Bhosale
NEET
NEET Exam
Maharashtra
Sangli District
NEET Rank
School Principal
Student Death
Violence Against Women
Yoga Day

More Telugu News