Maths Teacher: స్కూల్లో కీచక ఉపాధ్యాయుడు.. 24 మంది బాలికలపై వేధింపులు

Maths Teacher Arrested for Sexually Harassing 24 Students in Himachal School



విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వేధింపులకు దిగాడు. స్కూల్లో చదువుతున్న 24 మంది బాలికలపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడి అసభ్య చేష్టలు భరించలేక బాధిత బాలికలు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి పోలీసులు వచ్చి ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిర్మౌర్‌ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 8, 9, 10 వ తరగతి చదువుతున్న 24 మంది బాలికలను వేధింపులకు గురిచేశాడు. ఉపాధ్యాయుడి చేష్టలు రోజురోజుకూ పెరుగుతుండడంతో బాధిత బాలికలంతా కలిసి వెళ్లి ప్రిన్సిపాల్ కాంతాదేవికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఈ ఫిర్యాదును లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి పంపించారు. అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు కీచక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, వేధింపులు నిజమేనని తేలితే ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, పిల్లలపై లైంగిక వేధింపుల విషయం తెలిసి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూలు వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Maths Teacher
Himachal Pradesh school harassment
Sirmaur district
school sexual assault
POCSO Act case
minor girls abuse
sexual harassment case India
school teacher arrested
Kaanta Devi
crime news

More Telugu News