Ravi Raja Pinisetty: ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి

Raviraja Pinisetty
  • నిన్నటి తరం స్టార్ డైరెక్టర్ రవిరాజా 
  • ఎన్నో హిట్స్ ఇచ్చిన దర్శకుడు
  • రీమేక్ హక్కుల గురించిన ప్రస్తావన
  • భానుప్రియతో రజనీ మాట్లాడారని వెల్లడి

నిన్నటి తరం స్టార్ డైరెక్టర్స్ జాబితాలో తప్పకుండా కనిపించే పేరు రవిరాజా పినిశెట్టి. ఆయన దర్శత్వంలో చంటి .. పెదరాయుడు .. యముడికి మొగుడు .. బంగారు బుల్లోడు వంటి సూపర్ హిట్లు ఉన్నాయి. అలాంటి రవిరాజా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'పెదరాయుడు' సినిమాకి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. 

'పెదరాయుడు' .. ఓ తమిళ సినిమా నుంచి చేసిన రీమేక్. తెలుగు రీమేక్ హక్కుల విషయంలో గట్టి పోటీ ఉండేది. అయితే మోహన్ బాబుగారికి ఆ హక్కులు దక్కేలా రజనీకాంత్ గారు సాయం చేశారు. తెలుగులో నన్ను డైరెక్ట్ చేయమని మోహన్ బాబు గారు అన్నారు. అయితే ఓ 15 రోజులు సమయం తీసుకుని, కొన్ని మార్పులు .. చేర్పులు చేశాను. అవి నచ్చడంతో మోహన్ బాబు గారు ఓకే అన్నారు. అలా ఆ సినిమా పట్టాలెక్కింది" అని అన్నారు. 

" తమిళంలో శరత్ కుమార్ గారికి వదినగా 'ఖుష్బూ' నటించారు. తెలుగులో ఆ పాత్రకి 'భానుప్రియ'అయితే బాగుంటుందని నేను అన్నాను. అయితే అందుకు మోహన్ బాబుగారు ఒప్పుకోలేదు. నా అభిప్రాయాన్ని ఆయన రజనీ కాంత్ కి గారికి చెప్పారు. ఆయన కూడా ఆ పాత్రకి భానుప్రియ కరెక్ట్ అంటూ, ఆయనే ఆమెకి కాల్ చేసి మాట్లాడారు. మోహన్ బాబుగారు అయిష్టంగానే అంగీకరించారు. అలా భానుప్రియగారు ఈ సినిమాలోకి వచ్చారు" అని చెప్పారు.

Ravi Raja Pinisetty
Pedarayudu
Mohan Babu
Bhanupriya
Khushboo
Rajinikanth
Telugu Cinema
Director Interview
Movie Remake
Sarath Kumar

More Telugu News