Chandrababu Naidu: 'సుపరిపాలనలో తొలి అడుగు'... జ్యోతి ప్రజ్వలన చేసిన చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి

Chandrababu Naidu Launches Good Governance Initiative in Andhra Pradesh
  • ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి 
  • అమరావతిలో ప్రత్యేక సదస్సు
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన కార్యక్రమం
రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా, 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరిట అమరావతిలో నేడు ప్రత్యేక సదస్సును నిర్వహించారు. రాజధాని అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఈ కార్యక్రమానికి వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు ద్వారా గత ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణ, రెండో ఏడాది లక్ష్యాలపై విస్తృతంగా చర్చించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాలనలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించారు.

సమావేశంలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), వివిధ శాఖల ఉన్నతాధికారులు, శాఖాధిపతులు (హెచ్వోడీలు), అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. అంతేకాకుండా, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని విశ్లేషిస్తూనే, రాబోయే సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశం ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంచడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP Government
Good Governance
Pawan Kalyan
Nara Lokesh
Daggubati Purandeswari
Amaravati
AP Politics
Review Meeting

More Telugu News