Donald Trump: ఇరాన్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్.. ఎందుకంటే?

Donald Trump Thanks Iran After Missile Attack on Qatar Base
  • ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి
  • క్షిపణులతో దాడి చేస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చిన ఇరాన్
  • ప్రతీకార దాడులు చేయబోమని స్పష్టం చేసిన ట్రంప్
తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ నిన్న ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఖతార్ లోని అమెరికా అతిపెద్ద వైమానిక స్థావరం అల్ ఉదెయిద్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ సందర్భంగా ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ధన్యవాదాలు తెలిపాడు. అల్ ఉదెయిద్‌పై దాడులకు సంబంధించి ఇరాన్ ముందస్తు సమాచారం ఇచ్చిందని చెప్పారు. ఈ సమాచారం వల్లే ఖతార్ లో ప్రాణనష్టాన్ని నివారించగలిగామని పేర్కొన్నారు. ఇందుకు ఇరాన్ కు ధన్యవాదాలు అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అదేసమయంలో తమ దాడులకు ఇరాన్ ప్రతిస్పందన చాలా పేలవంగా ఉందని ఎద్దేవా చేశారు.

అల్ ఉదెయిద్‌పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు అమెరికా ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోదని ట్రంప్ సంకేతాలిచ్చారు. "ఇరాన్ తన 'వ్యవస్థ'లోని ద్వేషాన్ని పూర్తిగా బయటపెట్టిందని ఆశిస్తున్నాను. ఇకపై ఎలాంటి ద్వేషం ఉండదని నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు. "బహుశా ఇరాన్ ఇప్పుడు ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యం దిశగా పయనించగలదు. ఇదే బాటలో నడవాలని ఇజ్రాయెల్ ను ప్రోత్సహిస్తాను" అని ట్రంప్ తెలిపారు.

ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరంపై టెహ్రాన్ 14 క్షిపణులను ప్రయోగించగా, వాటిలో 13 క్షిపణులను కూల్చివేశామని, ప్రమాదం లేదనే ఉద్దేశంతో మరొక క్షిపణిని వదిలేశామని ట్రంప్ వివరించారు. ఇదే సమయంలో, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య "సంపూర్ణ మరియు పూర్తి" కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని, ఇరు దేశాల మధ్య సంఘర్షణను ముగించేందుకు ఇది దోహదపడుతుందని ట్రంప్ ప్రకటించారు.
Donald Trump
Iran
US military base Qatar
Al Udeid Air Base
Iran missile attack
Israel
US relations
Middle East conflict
Ceasefire
Trump tweet

More Telugu News