Benjamin Netanyahu: కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు.. ట్రంప్ కు థ్యాంక్స్

Benjamin Netanyahu Thanks US President
  • అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని 
  • ఇరాన్ అణు ముప్పు తొలగిందని ప్రకటన
  • పశ్చిమాసియాలో చల్లారిన యుద్ధ వాతావరణం
ఇరాన్ తో అణు ముప్పు తొలగిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ విషయంలో తమ దేశానికి సహకరించిన అమెరికా అధ్యక్షుడికి నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించడంతో, గత కొంతకాలంగా కొనసాగుతున్న ఘర్షణ వాతావరణానికి తెరపడే అవకాశం ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే.. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా, తాము కూడా సీజ్‌ఫైర్‌కు కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం వాస్తవమేనని ధ్రువీకరించినట్లయింది.
Benjamin Netanyahu
Israel
Iran
Donald Trump
Ceasefire Agreement
Nuclear Threat
US President
Middle East Conflict
Israel Iran Relations
Netanyahu News

More Telugu News