World War 3: మూడో ప్రపంచ యుద్ధమే వస్తే ఈ దేశాల్లో సేఫ్ గా ఉండొచ్చు..

World War 3 Which Countries Are Safest



ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉద్రిక్తతలు చల్లబడే అవకాశం ఉంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు ఏమేరకు కట్టుబడి ఉంటాయనే విషయంలో కొంత ఆందోళన ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరోవైపు అణు కేంద్రాలపై అమెరికా దాడులకు ముందే జాగ్రత్తపడ్డ ఇరాన్.. ఆయా కేంద్రాల నుంచి 400 కిలోల యురేనియం నిల్వలను రహస్య ప్రాంతానికి తరలించిందని ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే వస్తే భూమి మీద సేఫ్ గా ఉండే దేశాలు ఏవంటే..


అంటార్కిటికా
అణుశక్తి దేశాలకు చాలా దూరంగా, దక్షిణ ధ్రువంలో ఉండటం వల్ల ఇది సురక్షిత ప్రాంతంగా పరిగణిస్తున్నారు. సుమారు 1.4 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆశ్రయానికి అనుకూలమైనా, అక్కడి అతి శీతల వాతావరణం జీవనానికి సవాలు విసురుతుంది.


ఐస్‌లాండ్ 
అత్యంత శాంతియుత దేశాల్లో ఒకటిగా పేరుపొందిన ఐస్‌లాండ్ పూర్తిస్థాయి యుద్ధంలో ఎప్పుడూ పాల్గొనలేదు. దీని భౌగోళిక వాతావరణం సంప్రదాయ యుద్ధాలకు దూరంగా ఉంచుతుంది.


న్యూజిలాండ్
 ప్రపంచ శాంతి సూచికలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, తటస్థ వైఖరిని కలిగి ఉంది. పర్వత ప్రాంతాలు దీనికి రక్షణ కల్పిస్తాయి.


స్విట్జర్లాండ్
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా తటస్థంగా నిలిచిన స్విట్జర్లాండ్, పర్వతాలు, అణు షెల్టర్లతో సురక్షితంగా ఉంది.


గ్రీన్‌లాండ్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్, మారుమూల ప్రాంతం కావడం, రాజకీయ తటస్థత కారణంగా సురక్షితంగా ఉండొచ్చు.


ఇండోనేసియా 
 తటస్థ విదేశాంగ విధానాన్ని పాటిస్తూ, ప్రపంచ శాంతికి ప్రాధాన్యత ఇస్తుంది.


టువాలు
కేవలం 11,000 జనాభా కలిగిన ఈ చిన్న ద్వీప దేశం, పరిమిత మౌలిక వసతులు, వనరుల కారణంగా ఆకర్షణీయం కాని లక్ష్యంగా ఉంటుంది.


అర్జెంటీనా
గోధుమ వంటి పంటలు సమృద్ధిగా పండే అర్జెంటీనా, శీతాకాలంలో కూడా ఆహార కొరతను తట్టుకోగలదు.


భూటాన్
1971లో తటస్థత ప్రకటించినప్పటి నుండి, పర్వతాలు, భూపరివేష్టిత భౌగోళిక స్వరూపంతో రక్షణ పొందుతోంది.


చిలీ
4,000 మైళ్ల విస్తారమైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులు దీనికి భద్రత, సుస్థిరతను అందిస్తాయి.


ఫిజీ
ఆస్ట్రేలియాకు 2,700 మైళ్ల దూరంలో ఉన్న ఫిజీ, దట్టమైన అడవులు, తక్కువ సైనిక దృష్టి కారణంగా శాంతియుత ఆశ్రయంగా ఉంది.


దక్షిణాఫ్రికా
సారవంతమైన భూమి, మంచినీరు, ఆధునిక మౌలిక సదుపాయాలతో మనుగడకు మంచి అవకాశాలున్నాయి.
World War 3
Russia Ukraine war
Iran Israel conflict
safe countries
Antarctica
Iceland
New Zealand
Switzerland
Greenland
Indonesia

More Telugu News