Rishabh Pant: పంత్‌కు ఐసీసీ షాక్.. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి.. ఖాతాలో డిమెరిట్ పాయింట్!

Rishabh Pant reprimanded by ICC why has he been punished
  • టీమిండియా కీపర్ రిషభ్ పంత్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్య
  • హెడింగ్లీ టెస్టులో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పంత్
  • ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.8 ఉల్లంఘనగా నిర్ధారణ
  • తప్పు ఒప్పుకోవడంతో విచారణ లేకుండానే ముగిసిన వివాదం
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినందుకు గాను ఐసీసీ అతడిని మందలించింది. ఈ ఉల్లంఘన కారణంగా పంత్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ను పంత్ ఉల్లంఘించినట్లు తేలింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్ సమయంలో హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ క్రీజులో ఉండగా, బంతి ఆకృతి విషయమై పంత్ అంపైర్లతో చర్చించాడు. బంతిని పరిశీలించిన అంపైర్లు, దానిని మార్చడానికి నిరాకరించారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన పంత్, బంతిని అంపైర్ల ముందే నేలకేసి కొట్టాడు. 

ఇది అంపైర్ల నిర్ణయాన్ని ధిక్కరించడంగా పరిగణించారు. దాంతో ఆన్-ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్, థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, ఫోర్త్ అంపైర్ మైక్ బర్న్స్ ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు. గత 24 నెలల కాలంలో పంత్‌కు ఇదే మొదటి తప్పిదం కావడం గమనార్హం. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలలో ఒకరైన రిచీ రిచర్డ్‌సన్ ప్రతిపాదించిన శిక్షను పంత్ అంగీకరించడంతో ఈ విషయంపై అధికారిక విచారణ అవసరం లేకుండానే పరిష్కారమైంది.

ఇక‌, ఐసీసీ నిబంధనల ప్రకారం లెవెల్ 1 ఉల్లంఘనలకు అధికారిక మందలింపుతో పాటు ఆటగాడి మ్యాచ్ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం కోత విధించవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు డిమెరిట్ పాయింట్లను కూడా కేటాయించవచ్చు.
Rishabh Pant
India cricket
ICC
umpire decision
demerit point
England test match
cricket rules
Harry Brook
Ben Stokes
match referee

More Telugu News