Jahnavi Dangeti: దంగేటి జాహ్నవిని అభినందించిన జగన్

YS Jagan praises Jahnavi Dangeti selected for space mission
  • వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన జాహ్నవి
  • ప్రతి భారతీయుడికి, ఆంధ్రుడికి గర్వకారణమన్న జగన్
  • భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలుస్తూ, యువ ప్రతిభావంతురాలు కుమారి జాహ్నవి దంగేటి అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్ఠాత్మక టైటాన్స్ స్పేస్ సంస్థ నిర్వహించే ఆస్కాన్ (ASCAN) ప్రోగ్రామ్‌కు ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ (వ్యోమగామి అభ్యర్థి)గా ఎంపికయ్యారు. 2029లో చేపట్టతలపెట్టిన అంతరిక్ష యాత్ర కోసం ఆమె ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వార్త తెలియగానే జాహ్నవికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ అధినేత జగన్ కూడా జహ్నవిని అభినందించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... "అంతరిక్షయానానికి ఎంపికైన తొలి భారతీయ యువతి, అందునా ఏపీకి చెందిన యువతి కావడం ప్రతి భారతీయుడికి, ఆంధ్రుడికి గర్వకారణం. ఎంతోమందికి జాహ్నవి స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్తులో జాహ్నవి మరిన్ని విజయాలు సాధించాలి" అని ఆకాంక్షించారు.   

టైటాన్స్ స్పేస్ అనేది అంతరిక్ష పరిశోధనలు, యాత్రల రంగంలో పనిచేస్తున్న ఒక ప్రముఖ సంస్థ. ఈ సంస్థ వ్యోమగాములను తయారుచేయడానికి ప్రత్యేకంగా ఆస్కాన్ (ASCAN) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కఠినమైన ఎంపిక ప్రక్రియల అనంతరం, అత్యంత ప్రతిభ కనబరిచిన వారిలో ఒకరిగా జాహ్నవి దంగేటి ఈ కార్యక్రమానికి ఎంపిక కావడం విశేషం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆమె వ్యోమగామిగా అవసరమైన సమగ్ర శిక్షణను పొందనున్నారు. అనంతరం, 2029లో ప్రణాళిక చేసిన అంతరిక్ష యాత్రలో పాలుపంచుకునే అవకాశం దక్కించుకున్నారు.
Jahnavi Dangeti
Jahnavi Dangeti space
Andhra Pradesh
space mission
Indian youth
YS Jagan
AP news
space travel
India
women in space

More Telugu News