Jagan: సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు

Jagan Issued Notices in Singaiah Death Case
  • ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన జగన్
  • సింగయ్య అనే వ్యక్తి మృతి
  • జగన్ ను ఏ2గా చేర్చిన పోలీసులు 
  • నేడు వైసీపీ ఆఫీసులో నోటీసులు అందించిన పోలీసులు
ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి వైసీపీ అధినేత జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు. 

ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు... తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 
Jagan
YS Jagan
Singaiah death case
Rentapalla
Palnadu district
YSRCP
Lella Appireddy
Andhra Pradesh police
Road accident

More Telugu News