TTD: జులై నెలలో శ్రీవారి ఉత్సవాల జాబితా విడుదల చేసిన టీటీడీ

TD Announces Srivari Utsavalu List for July



కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రతి నెలా వివిధ రకాల విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా జులై నెలలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా జులై మాసంలో విశేష ఉత్సవాలు జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలో జులై మాసంలో జరగబోయే విశేష ఉత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. జులై నెలలో 5వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకూ తొమ్మిది రకాల విశేష ఉత్సవాలు జరగనున్నాయి.

**జులై నెలలో జరగనున్న ఉత్సవాలు ఇలా ఉన్నాయి.**

* జులై 5న పెరియాళ్వార్ శాత్తుమొర
* జులై 6న శయన ఏకాదశి, చాతుర్మాస వ్రతారంభం
* జులై 7న శ్రీనాథ మునుల వర్షతిరునక్షత్రం
* జులై 10న గురు పౌర్ణమి గరుడసేవ
* జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం
* జులై 25న తిరుమల చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
* జులై 28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు
* జులై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ
* జులై 30న కల్కి జయంతి, కశ్యపు మహర్షి జయంతి

ఈ శ్రీవారి విశేష ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 
TTD
Tirumala
Srivari Utsavalu
July Festivals
Tirumala Tirupati Devasthanam
Srivari Temple
Annual Festivals
Garuda Seva
Chakrathalwar
Anivari Asthanam

More Telugu News