Sonam Raghuvanshi: హనీమూన్ హత్య కేసు.. ప్రియుడితో సంబంధం నిజమేనన్న భార్య సోనమ్!

Sonam Raghuvanshi Raj Kushwaha Admitted To Relationship
  • తమ సంబంధానికి, వ్యాపార ఆకాంక్షలకు అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య
  • నిందితురాలికి నార్కో టెస్ట్ నిర్వహించే డిమాండ్‌ను తోసిపుచ్చిన పోలీసులు
  • త్వరలోనే పటిష్ఠ‌మైన ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు పోలీసుల యత్నం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు తమ మధ్య ఉన్న సంబంధాన్ని అంగీకరించినట్లు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. ఈ దారుణమైన హత్యోదంతంపై దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), నిందితురాలైన సోనమ్‌కు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలన్న మృతుడి కుటుంబ సభ్యుల డిమాండ్‌ను తిరస్కరించింది. తమ వద్ద కేసును నిరూపించడానికి అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

సోనమ్, ప్రియుడు రాజ్ త‌మ‌ మధ్య సంబంధం నిజమేనని ఒప్పుకోలు
ఈస్ట్ ఖాసీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సయీమ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... విచారణ సమయంలో సోనమ్, రాజ్ ఇద్దరూ తమ మధ్య సంబంధం ఉందని ఒప్పుకున్నారని తెలిపారు. "వారు ఇప్పటికే నేరాన్ని అంగీకరించారు. మేము నేరం జరిగిన తీరును పునఃసమీక్షించాము (క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్). వారు మాకు అంతా చూపించారు. మాకు తగిన ఆధారాలు లభించాయి. ఈ దశలో నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించాల్సిన అవ‌స‌రం లేదు. సాధారణంగా ఎటువంటి ఆధారాలు లేనప్పుడు నార్కో టెస్ట్ చేస్తారు. పైగా నార్కో అనాలిసిస్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది" అని ఆయన పేర్కొన్నారు. 

హత్య వెనుక ఆంతర్యం
హత్యకు నిర్దిష్టంగా 'డబ్బు' కారణమని అధికారి స్పష్టంగా చెప్పనప్పటికీ, రాజాను తమ దారి నుంచి తొలగించుకోవాలనే వారి కోరిక, వారి సంబంధం, వ్యాపార ఆకాంక్షలతో ముడిపడి ఉందని పోలీస్ అధికారి తెలిపారు. "వారు రాజాను ఈ మొత్తం వ్యవహారం నుంచి బయటకు పంపాలనుకున్నారు. ఎందుకంటే వారి మధ్య సంబంధం ఉంది. తల్లిదండ్రుల మధ్య అంగీకారం కుదరాల్సిన ఆచారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారు ఈ వ్యక్తిని (రాజాను) వదిలించుకుంటే మంచిదని భావించారు" అని అధికారి తెలిపారు.
Sonam Raghuvanshi
Meghalaya honeymoon murder case
Raja Raghuvanshi murder
Raj Kushwaha
East Khasi Hills
crime scene reconstruction
narco analysis test
love affair
extra marital affair
murder investigation

More Telugu News