Ganesh Mani Ratnam: ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన

Ganesh Mani Ratnam and Shanmukhi Nagasai Congratulated by SAP Chairman
  • శాప్ చైర్మన్‌ను కలిసిన అర్చరీ క్రీడాకారులు గణేశ్ మణిరత్నం, షణ్ముఖి నాగసాయి
  • సింగపూర్‌లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో మెడల్స్ సాధించిన టి.గణేశ్, షణ్ముఖి నాగసాయి
ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు సింగపూర్‌లో జరిగిన ఆర్చరీ ఆసియా కప్ లెగ్-2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు టి.గణేష్ మణిరత్నం, అలాగే ఇండివిడ్యువల్, మిక్స్‌డ్, టీమ్ ఈవెంట్లలో సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణి బి.షణ్ముఖి నాగసాయిలను శాప్ చైర్మన్ రవినాయుడు అభినందించారు.

విజయవాడలోని శాప్ కార్యాలయంలో నిన్న చైర్మన్ రవినాయుడును వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్చరీలో వారు సాధించిన పతకాలు, విజయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారిని శాప్ చైర్మన్ అభినందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, దేశ ఖ్యాతిని విస్తృతం చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వోల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, ఆర్చరీ కోచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 
Ganesh Mani Ratnam
Archery Asia Cup
Singapore
B Shanmukhi Nagasai
SAP Chairman
Archery
Silver Medal
Volga Archery Academy
Ravinaidu
Sports

More Telugu News