Telangana Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

High Court Key Verdict on Local Body Elections in Telangana
--
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అనగా సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ టి.మాధవీదేవి తీర్పు ఇచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరగా.. రిజర్వేషన్లను అమలు చేసేందుకు 30 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 3 నెలల సమయం ఇస్తూ సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెలువరించింది.
Telangana Panchayat Elections
Telangana local body elections
Telangana elections
High Court verdict
State Election Commission
Local body polls
Election schedule
Justice T Madhavi Devi
Telangana government

More Telugu News