Manchu Vishnu: ఆంధ్రప్రదేశ్‌లో మంచు విష్ణు 'కన్నప్ప' టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి

Manchu Vishnus Kannappa Ticket Prices Increased in Andhra Pradesh
  • మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీలో ఆమోదం
  • సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో రూ.50 వరకు అదనపు వసూలు
  • పది రోజుల పాటు కొత్త ధరలు వర్తింపు
  • జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కన్నప్ప'
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన 'కన్నప్ప' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్‌లో పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శితమయ్యే సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.50 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పెరిగిన ధరలు సినిమా విడుదలైన తేదీ నుండి పది రోజుల పాటు అమల్లో ఉంటాయి.

'కన్నప్ప' చిత్రాన్ని మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నారు. దాదాపు పదేళ్ల పాటు ఆయన ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. రుద్రగా ప్రభాస్‌, కిరాత పాత్రలో మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌ కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
Manchu Vishnu
Kannappa Movie
Telugu Movie
Ticket Price Hike
Andhra Pradesh
Prabhas

More Telugu News