Watchman: వాచ్‌మన్ దెబ్బలు భరించలేక 17వ అంతస్తు నుంచి దూకి శునకం మృతి.. సోషల్ మీడియా ఫైర్

Watchman Throws Dog from 17th Floor in Mumbai
  • ముంబైలో వాచ్‌మెన్ అమానుషం
  • ఘటనా స్థలంలోనే శునకం మృతి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • వాచ్‌మన్ తీరుపై విరుచుకుపడుతున్న జనం
ముంబై నగరంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ నివాస భవనంలో కాపలాదారుగా పనిచేస్తున్న వ్యక్తి ఒక శునకాన్ని అత్యంత కిరాతకంగా హింసించి, 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసేసి దాని మృతికి కారణమయ్యాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి కర్రతో కుక్కను దారుణంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన శునకం చివరికి బాల్కనీ పైనుంచి దూకేసింది. అనంతరం, కిందపడి ప్రాణాలు విడిచింది. ఈ షాకింగ్ వీడియోను జంతు హక్కుల కార్యకర్త విజయ్ రంగారే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ భవన వాచ్‌మన్ ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కానీ అది సరిపోదని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. "దయచేసి కఠిన చర్యలు తీసుకోండి. ఆ మూగజీవి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించింది, కానీ దానివల్ల కాక భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. "ఈ ఘటనలో సొసైటీ ప్రమేయం లేదు. పై అంతస్తులో ఉన్న కుక్కను చూసి, దాన్ని సురక్షితంగా కిందకు తీసుకురమ్మని ఓ వ్యక్తి వాచ్‌మెన్‌కు చెప్పారు. అయితే, సాయం చేయడానికి బదులుగా వాచ్‌మెన్ కుక్కను వేధించి, ఒక మూలకు నెట్టి, చివరికి అది పైనుంచి దూకేలా చేశాడు" అని మరో యూజర్ఈ పేర్కొన్నాడు. ఘటన అనంతరం కొందరు వ్యక్తులు సెక్యూరిటీ గార్డును నిలదీసి, చితకబాదిన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  
Watchman
Mumbai dog
dog abuse
animal cruelty
Mumbai crime
animal rights
social media video
FIR
police investigation
dog death

More Telugu News