Courtallam Falls: కనువిందు చేస్తున్న కుర్తాళం జలపాతం.. పర్యాటకులపై అధికారుల ఆంక్షలు.. వీడియో ఇదిగో!

Courtallam Falls Dazzles Tourists Amid Restrictions After Heavy Rains
  • టెన్‌కాశీలో వరద బీభత్సం నేపథ్యంలో అధికారుల నిర్ణయం
  • పర్యాటకుల భద్రత దృష్ట్యా జలపాతంలో స్నానాలు బంద్
  • కుండపోత వానలతో తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తం
తమిళనాడులో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన కుర్తాళం జలపాతం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

కుర్తాళం మెయిన్ ఫాల్స్‌తో పాటు మిగిలిన జలపాతాలు కూడా ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. దీంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుర్తాళం జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు చేయకుండా తాత్కాలికంగా నిషేధం విధించారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టి, పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం జలపాతం వద్ద భద్రతా సిబ్బందిని మోహరించి, పర్యాటకులు నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Courtallam Falls
Tamil Nadu rains
Courtallam
waterfalls
tourism
heavy rainfall
flood alert
safety measures
tourist ban

More Telugu News