Jagan Mohan Reddy: జగన్ కారును తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు

RTA Officials Inspect Jagans Car After Accident
  • రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన
  • కారు ఫిట్‌నెస్‌ను పరిశీలించిన రవాణా శాఖ అధికారులు
  • ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వాహనం


వైసీపీ అధినేత జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి ఈ తనిఖీ చేపట్టారు. ఏపీ 40 డీహెచ్ 2349 రిజిస్ట్రేషన్ నంబరు గల ఈ కారును ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు.

వివరాల్లోకి వెళితే, ఇటీవల జగన్ రెంటపాళ్లలో పర్యటించినప్పుడు సింగయ్య అనే వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్ర కలకలం రేగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ (ఎంవీఐ) గంగాధర ప్రసాద్ నేతృత్వంలోని బృందం కారు సాంకేతిక పరిస్థితిని, ఫిట్‌నెస్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. తనిఖీ అనంతరం వాహనాన్ని తదుపరి విచారణ నిమిత్తం పోలీసుల ఆధీనంలోనే ఉంచారు.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్‌రెడ్డిలను నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.
Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh
Rentapalla
Car Accident
Road Accident
Police Investigation
Motor Vehicle Inspector
Vehicle Inspection
YSR Congress

More Telugu News