Israel: లెబనాన్ లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు

Israel Launches Heavy Strikes on Lebanon Hezbollah Targets
  • ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు
  • హెజ్‌బొల్లా భూగర్భ స్థావరాలే లక్ష్యంగా దాడి
  • బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డ సైన్యం
  • భారీగా దెబ్బతిన్న భవనాలు, పలువురికి గాయాలు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్‌ వైపు సారించింది. శుక్రవారం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన భూగర్భ స్థావరాలపై అత్యంత శక్తిమంతమైన 'బంకర్ బస్టర్' బాంబులతో విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ చర్యతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

లెబనాన్‌లోని పర్వత ప్రాంతాలలో ఉన్న హెజ్‌బొల్లా భూగర్భ స్థావరాలే లక్ష్యంగా తమ వైమానిక దళం ఈ దాడులు జరిపిందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన కీలక ఆయుధాగారాలను ధ్వంసం చేశామని వారు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా దాడులు చేయడంతోనే ఈ ప్రతిదాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

భారీ నష్టం.. శిథిలాల కింద ప్రజలు

ఇజ్రాయెల్ ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబుల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనలో పలువురు పాలస్తీనియన్లు గాయపడ్డారని లెబనాన్ వార్తా సంస్థలు నివేదించాయి. బాంబుల తీవ్రతకు కూలిన భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

Israel
Lebanon
Hezbollah
Bunker Buster Bombs
Israel-Lebanon Conflict

More Telugu News