Shikhar Dhawan: రోహిత్ శర్మతో షేర్ చేసుకుంటున్న రూమ్ లోకి గర్ల్‌ఫ్రెండ్‌ను రహస్యంగా తీసుకొచ్చిన ధావన్!

Shikhar Dhawan Girlfriend Secretly in Room with Rohit Sharma
  • 2006 ఆస్ట్రేలియా పర్యటన నాటి ప్రేమకథను బయటపెట్టిన శిఖర్ ధావన్
  • గర్ల్‌ఫ్రెండ్‌ను రోహిత్ శర్మతో పంచుకున్న రూమ్‌కు రహస్యంగా తీసుకెళ్లానని వెల్లడి
  • 'నన్ను నిద్రపోనిస్తావా?' అని రోహిత్ అప్పుడప్పుడు అరిచేవాడని ధావన్ వెల్లడి
  • హోటల్ లాబీలో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉండగా సెలక్టర్ కంటపడ్డానని అంగీకారం
  • ప్రేమ వ్యవహారం వల్లే తన ఆటతీరు దెబ్బతిందని గుర్తుచేసుకున్న ధావన్
టీమిండియా మాజీ ఓపెనర్, డ్యాషింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాడు. దాదాపు 18 క్రితం, 2006లో ఇండియా 'ఏ' జట్టు తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఆ పర్యటనలో ఒక ఆస్ట్రేలియా అమ్మాయితో ప్రేమలో పడ్డానని, ఆమెను తాను ఉంటున్న హోటల్ గదికి రహస్యంగా తీసుకెళ్లేవాడినని వెల్లడించాడు. ఆ టూర్ సమయంలో ఆ గదిలో తనతో పాటు రోహిత్ శర్మ కూడా ఉండేవాడని తెలిపాడు.

ఈ విషయాన్ని ధావన్ తన ఆత్మకథలో ప్రస్తావించగా, 'స్పోర్ట్‌స్టార్' పత్రిక ఆ వివరాలను ఉటంకించింది. ఆ పర్యటనలో ఎలెన్ (అసలు పేరు కాదు) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయానని ధావన్ పేర్కొన్నాడు. "ఆమె చాలా అందంగా ఉంది, ఒక్కసారిగా ప్రేమలో మునిగిపోయాను. నా జీవిత భాగస్వామి తనే అని, ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను" అని ధావన్ తన పుస్తకంలో రాసుకున్నాడు.

పర్యటన ప్రారంభంలో ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించానని, కానీ ఆ తర్వాత తన దృష్టి ఆటపై నుంచి ప్రేమ వైపు మళ్లిందని ధావన్ తెలిపాడు. "ప్రతి మ్యాచ్ తర్వాత నేను ఎలెన్‌ను కలవడానికి వెళ్లేవాడిని. కొద్దికాలానికే, నేను రోహిత్ శర్మతో పంచుకుంటున్న మా హోటల్ గదికి ఆమెను రహస్యంగా తీసుకెళ్లడం ప్రారంభించాను. దీంతో రోహిత్ అప్పుడప్పుడు, 'నన్ను ప్రశాంతంగా నిద్రపోనిస్తావా?' అని హిందీలో ఫిర్యాదు చేసేవాడు" అని ధావన్ వివరించాడు.

కొద్దిరోజులకే ఈ ప్రేమ వ్యవహారం జట్టు మొత్తానికి తెలిసిపోయింది. "ఒకరోజు సాయంత్రం ఎలెన్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లాను. ఆ తర్వాత మేము చేతిలో చేయి వేసుకుని హోటల్ లాబీలో నడుస్తుండగా, మాతోపాటు పర్యటనలో ఉన్న ఒక సీనియర్ నేషనల్ సెలక్టర్ మమ్మల్ని చూశారు. ఆ వార్త జట్టులో దావానలంలా వ్యాపించింది. మేమేమీ తప్పు చేయడం లేదన్న భావనతో ఆమె చేయి వదిలిపెట్టాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. అయితే, ఆ పర్యటనలో నిలకడగా రాణించి ఉంటే, నాకు సీనియర్ జట్టులో చోటు దక్కేది. కానీ నా ఆటతీరు క్రమంగా పడిపోయింది" అని ధావన్ అంగీకరించాడు.

ఈ సంఘటన జరిగినప్పటికీ, శిఖర్ ధావన్ ఆ తర్వాత భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా వన్డేల్లో 17 శతకాలు, 39 అర్ధశతకాలతో 6793 పరుగులు సాధించి విజయవంతమైన ఓపెనర్‌గా నిలిచాడు.
Shikhar Dhawan
Rohit Sharma
India A
Australia tour
love affair
hotel room
national selector
cricket
Indian cricketer
Ellen

More Telugu News