Donald Trump: అధ్యక్ష పదవి చాలా ప్రమాదకరం.. ఎప్పుడు చస్తామో తెలియదు: డొనాల్డ్ ట్రంప్

- అధ్యక్ష పదవిపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- అదొక అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగమన్న ట్రంప్
- కారు రేసింగ్, బుల్ రైడింగ్‌తో అధ్యక్ష పదవి పోలిక
- ముందే తెలిసి ఉంటే ఈ రేసులో ఉండేవాడిని కాదన్న అమెరికా అధ్యక్షుడు
- గతేడాది తనపై జరిగిన హత్యాయత్నాన్ని గుర్తుచేసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవి అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగమని, అందులో ప్రాణాలకు గ్యారెంటీ ఉండదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వ్యాఖ్యానించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పదవిలో ఉండటం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాదకరమని తెలిపారు.
ఈ సందర్భంగా కారు రేసింగ్ లేదా బుల్ రైడింగ్ వంటి ప్రమాదకరమైన క్రీడలతో అధ్యక్ష పదవిని పోల్చారు. ఆ వృత్తుల్లో లాగే ఇక్కడ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని పేర్కొన్నారు. ఇంతటి ప్రమాదం ఉందని తనకు ఎవరైనా చెప్పి ఉంటే తాను ఈ పోటీలోనే ఉండేవాడినే కాదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని పేర్కొన్నారు.
గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఓ సభలో ప్రసంగిస్తుండగా సమీపంలోని భవనం పైనుంచి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి గాయమైన విషయం తెలిసిందే.
ఆ ఘటన తర్వాత కూడా తనను లక్ష్యంగా చేసుకుని పలుమార్లు దాడులకు ప్రయత్నాలు జరిగాయని ట్రంప్ పరోక్షంగా ప్రస్తావించారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్‌లో ఆయన గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీతో ఫెన్సింగ్ వద్దకు రాగా భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపి పట్టుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత ట్రంప్ హాజరైన సమావేశానికి సమీపంలో ఉన్న నేషనల్ కన్వెన్షన్ వద్ద, ఏకే-47 రైఫిల్‌తో సంచరిస్తున్న ఓ సాయుధ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. తనపై వరుసగా జరిగిన ఈ హత్యాయత్నాల నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతోంది.