Mother set on fire: డబ్బు విషయంలో గొడవ.. వరంగల్ లో కన్నతల్లికి నిప్పంటించిన కొడుకు

Son sets mother ablaze in Warangal over money dispute
--
డబ్బు విషయమై తలెత్తిన వివాదంలో కన్నతల్లినే అంతమొందించేందుకు ప్రయత్నించాడో కుమారుడు.. తల్లిపై పెట్రోల్ చల్లి నిప్పంటించి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విని ఇరుగుపొరుగు వారు మంటలు ఆర్పి అంబులెన్స్ కు ఫోన్ చేశారు. వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుందీ ఘటన.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటుపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని సతీశ్‌ తన తల్లి వినోద(60)తో కొన్నిరోజులుగా డబ్బు విషయంలో గొడవపడ్డాడు. ఈ రోజు తెల్లవారుజామున మరోసారి గొడవ జరగగా.. సతీశ్ తీవ్ర ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. మంటలు అంటుకుని బాధతో వినోద అరవడంతో సతీశ్ పారిపోయాడు. వినోద అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వచ్చి మంటలు ఆర్పారు.

అంబులెన్స్ కు ఫోన్ చేసి వినోదను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యుులు తెలిపారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుడు సతీశ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Mother set on fire
Muthineni Satish
Warangal
Kuntapalli
Crime news
Petrol attack
Money dispute
Telangana crime
Sangeem mandal
MGM Hospital Warangal

More Telugu News