Adarsh Jaiswal: ప్రియురాలి కోసం రైల్వే టీటీఈ అవతారం

Varanasi Police Arrest Fake TTE Adarsh Jaiswal for Cheating Passengers
  • ప్రయాణికుల నుంచి వసూళ్లకు పాల్పడిన యువకుడు
  • వారణాసిలో నకిలీ టీటీఈని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు
  • ప్రేమించిన యువతిని పెళ్లాడేందుకే ఈ మోసానికి పాల్పడినట్లు వెల్లడి
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఓ బీటెక్ గ్రాడ్యుయేట్ తప్పుదారి పట్టాడు. నకిలీ టీటీఈ అవతారం ఎత్తి, ప్రయాణికులను మోసం చేస్తూ చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన వారణాసిలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన ఆదర్శ్ జైస్వాల్ అనే యువకుడిని వారణాసి గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సంయుక్తంగా అరెస్ట్ చేశారు. జైస్వాల్ కొంతకాలంగా టీటీఈగా నటిస్తూ, ప్రయాణికులకు నకిలీ టికెట్లు అమ్మి మోసం చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నిఘా పెట్టిన పోలీసులు జైస్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన నకిలీ ఐడీ కార్డుతో పాటు టీటీఈ ధరించే ఏప్రాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం దొరకకపోవడం, ప్రియురాలి తల్లిదండ్రుల షరతుల కారణంగానే తాను టీటీఈ అవతారం ఎత్తినట్లు జైస్వాల్ పోలీసులకు వెల్లడించాడు. ప్రియురాలిని, ఆమె తల్లిదండ్రులను నమ్మించేందుకు నకిలీ ఐడీ కార్డు తయారుచేయించుకున్నట్లు తెలిపాడు. ప్రయాణికులను మోసం చేసి డబ్బు వసూలు చేసినట్లు అంగీకరించాడు.

ఇటీవల జనతా ఎక్స్‌ప్రెస్‌లో వారణాసి నుంచి లక్సర్‌కు వెళ్లేందుకు జ్యోతి కిరణ్ అనే ప్రయాణికురాలికి జైస్వాల్ బీ-3 కోచ్‌లో టికెట్ అమ్మాడు. అయితే, రైల్వే స్టేషన్‌కు వెళ్లాక ఆ రైలుకు అసలు బీ-3 కోచ్ లేదని తెలియడంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. జైస్వాల్ ఇలాగే పలువురిని మోసం చేసినట్లు తేలింది. ప్రయాణికుల ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Adarsh Jaiswal
Varanasi
Fake TTE
Railway Police
Fraud
Crime
Love Affair
B Tech Graduate
Indian Railways
নকল టికెట్లు

More Telugu News