Telangana Government: తెలంగాణలో 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రమోషన్లు

Telangana Government Promotes 33 Special Grade Deputy Collectors
  • స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అదనపు కలెక్టర్లుగా ప్రమోషన్
  • ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్
  • రూ.96,890ల నుంచి రూ.1,58,380ల వరకు వేతన స్కేల్ ఉంటుందని వెల్లడి
రాష్ట్రంలో ఒకేసారి 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. 33 మంది డిప్యూటీ కలెక్టర్లను అదనపు కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఈ పదోన్నతులు కల్పించినట్లు ఉత్తర్వులో రెవెన్యూ కార్యదర్శి పేర్కొన్నారు. వీరికి రూ.96,890ల నుంచి రూ.1,58,380ల వరకు వేతన స్కేలు ఉంటుందని తెలిపారు.

పదోన్నతులు కల్పించినందుకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రభుత్వ పెద్దలకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. 
Telangana Government
Telangana
Deputy Collectors
Special Grade Deputy Collectors
Promotion
Lokesh Kumar
Revanth Reddy
Ponguleti Srinivas Reddy
Revenue Department

More Telugu News