America: ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు భారీగా ఆయుధాలను వినియోగించిన అమెరికా

America Used Massive Weapons to Counter Iran Attacks
  • ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచిన అమెరికా
  • 11 రోజుల్లోనే అమెరికా అత్యాధునిక క్షిపణి వ్యవస్థలో 15 నుండి 20 శాతం వినియోగించినట్లు అంచనా
  • మిలటరీ వాచ్ మ్యాగజీన్ ప్రకారం .. దాదాపు 800 మిలియన్ డాలర్లకుపైగా ఖర్చు కావచ్చని అంచనా 
ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా నిలిచిన విషయం విదితమే. ఈ క్రమంలో అమెరికా భారీగా ఆయుధాలను వినియోగించింది. ఇరాన్ ప్రతిదాడులను తిప్పికొట్టే క్రమంలో 11 రోజుల వ్యవధిలోనే అమెరికా తమ వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి వ్యవస్థల్లో 15 నుంచి 20 శాతం వినియోగించినట్లు ఓ నివేదిక అంచనా వేసింది.

ఇరాన్ దాడులను ధీటుగా తిప్పికొట్టేందుకు అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) లను అమెరికా వినియోగించినట్లు మిలటరీ వాచ్ మ్యాగజీన్ పేర్కొంది. 60 నుంచి 80 THAAD ఇంటర్ సెప్టర్లను అమెరికా ఉపయోగించినట్లు అంచనా. ఒక్కో ఇంటర్ సెప్టర్‌కు 12 నుండి 15 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అంటే మొత్తంగా దాదాపు 800 మిలియన్ డాలర్లకు పైగా అమెరికా ఖర్చు చేసినట్లు అంచనా.

ఇజ్రాయెల్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాదే THAAD వ్యవస్థను అక్కడ మోహరించినట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా ఏటా 50 నుండి 60 ఇంటర్ సెప్టర్లను తయారు చేస్తుండగా, ఈ 11 రోజుల్లోనే పెద్ద మొత్తంలో వినియోగించింది. వీటిని భర్తీ చేసేందుకు అమెరికాకు అనేక నెలలు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
America
Iran attacks
Israel
THAAD
Terminal High Altitude Area Defense
missile defense system
Pentagon
military
interceptor missiles

More Telugu News