Chandrababu Naidu: నేడు టీడీపీ నేతలతో కీలక సమావేశం .. ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు

- చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
- జులై 2 నుంచి ఇంటింటి ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు, లోకేశ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జులై 2 నుంచి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు హాజరుకానున్నారు. దాదాపు నెల రోజుల పాటు కూటమి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే దానిపై పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే టీడీపీ కమిటీలు, కొత్త కార్యవర్గం ఇతర అంశాలపైనా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు.